
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న సోమేశ్ కుమార్ నియామకాన్ని తప్పు పట్టింది. అంతేకాదు సోమేశ్ కుమార్ నియామకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అలాగే తీర్పు కాపీ అందిన వెంటనే ఏపీ కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే అప్పటి కేంద్ర నిర్ణయాన్ని కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఇక అప్పటి నుండి అంటే 2014 నుండి ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు సోమేశ్ కుమార్. తనకు మూడు వారాల సమయం కావాలని కోరినప్పటికీ హైకోర్టు సోమేశ్ కుమార్ న్యాయవాది వాదనను పట్టించుకోలేదు. దాంతో సోమేశ్ కుమార్ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు.