
బ్రేకింగ్ ……. భారతీయ జనతా పార్టీ చేపట్టనున్న మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TSPSC పేపర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వ నియంతృత్వ పోకడలను నిరసిస్తూ బీజేపీ ధర్నా చౌక్ లో మహాధర్నా చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. అయితే ఈ మహాధర్నా లో కేవలం 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. హైకోర్టు అనుమతితో రేపు ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ లో బీజేపీ మహాధర్నా కార్యక్రమం చేపట్టనుంది.