Home EXCLUSIVE TSPSC కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

TSPSC కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

45
telangana high court orders on  tspsc paper leak case 
telangana high court orders on  tspsc paper leak case 

 

telangana high court orders on  tspsc paper leak case 
telangana high court orders on  tspsc paper leak case

TSPSC పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ దర్యాప్తు వివరాలను ఇవ్వాలని కోరగా అందుకు సమయం కోరింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో ఏప్రిల్ 11 లోపు వివరాలు అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11 కు వాయిదా వేసింది హైకోర్టు.

5 లక్షల మంది అప్లయ్ చేసుకోగా మూడున్నర లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 25 వేల మంది ప్రిలిమ్స్ కు సెలెక్ట్ అయ్యారు. మొత్తంగా 6 ఎగ్జామ్స్ ను TSPSC రద్దు చేసింది. పేపర్ లీకేజ్ విషయంలో సిట్ ఓ వైపు దర్యాప్తు చేస్తూనే ఉంది మరోవైపు మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేవలం ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ లీకేజీకి పాల్పడ్డారని చెప్పడం దర్యాప్తును పక్కదారి పట్టించడమే అంటూ పిటిషనర్ తరుపు న్యాయవాది వివేక్ వాదనలు వినిపించారు.

ఇక ఈ వాదనలపై తీవ్ర అభ్యంతరం చెప్పాడు ప్రభుత్వ తరుపు న్యాయవాది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పిటీషన్ వేశారని దాన్ని కొట్టివేయాలని వాదించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్ ను ఏర్పాటు చేసిందని , 9 మందిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తోందని , ఇందులో ప్రభుత్వం ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని వాదించారు ప్రభుత్వ న్యాయవాది.