31.4 C
India
Thursday, April 25, 2024
More

    పెట్టుబడుల ఆకర్షణలో టాప్ తెలంగాణ.. లాస్ట్ లో ఏపీ

    Date:

    Telangana is top in terms of investment attraction.. AP is last
    Telangana is top in terms of investment attraction.. AP is last

    విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లో ఆకర్షణలో తెలంగాణ టాప్ టెన్ లో 7వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం.. అక్టోబర్ 2019 – సెప్టెంబర్ 2022 మధ్య రూ. 1261471 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐలు) భారతదేశానికి వచ్చాయి.

    ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 27.87% అంటే రూ. 351330 కోట్లు మహారాష్ట్రకు తరలిపోయాయి. రూ. 293106 కోట్లతో 23.26%తో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. చంద్రబాబు హయాంలో 2014–19 మద్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్ 5లో నిలిచిన సంగతి తెలిసిందే.

    ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు ఉపాధి కల్పన కంటే ఉచిత పథకాలకు ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఉచిత పథకాలతో ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమనే ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    దీంతో ఇప్పుడు టాప్-10 రాష్ట్రాల జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోలేదు. అక్టోబర్ 2019 – సెప్టెంబర్ 2022 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కు రూ. 4960 కోట్ల ఎఫ్డిఐలు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. ఇది భారతదేశానికి వచ్చిన మొత్తం ఎఫ్డిఐలలో 1% కూడా కాదని చెబుతున్నారు. భారత్కు లభించిన మొత్తం ఎఫ్డిఐలలో ఇది 0.39% మాత్రమే.

    ఇదే సమయంలో పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇదే కాలంలో రూ.33025 కోట్ల విలువైన ఎఫ్డిఐలను పొంది దేశంలో ఏడవ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన దానిలో ఆంధ్రప్రదేశ్కు కేవలం 15% మాత్రమే దక్కిందని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    Telangana : తెలంగాణలో రేపు వర్షాలు

    Telangana : రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని...

    Peddapally District : పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

    Peddapally District : పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న...

    Kondagattu : కొండగట్టు అంజన్న దర్శనానికి 3 గంటలు – భారీ సంఖ్యలో తరలివస్తున్న దీక్షాపరులు

    Kondagattu Anjaneya Swamy : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు...