రాజ్యసభ చైర్మన్ , భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ , లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిశారు భారత్ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి గా ఉన్న మాపార్టీ ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి గా మారినందున పార్లమెంట్ ఉభయ సభల్లో మమ్మల్ని ఇక నుండి భారత్ రాష్ట్ర సమితి సభ్యులు గా గుర్తించాలని కోరారు. ఆమేరకు భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు విజ్ఞాపన పత్రాలను కూడా అందజేశారు. రాజ్యసభ చైర్మన్ , లోక్ సభ స్పీకర్ ను కలిసిన వాళ్లలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు , నామా నాగేశ్వరరావు, జోగినపల్లి సంతోష్ కుమార్ , బీబీ పాటిల్ , రవిచంద్ర తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత్ రాష్ట్ర సమితి గా మారిన విషయం తెలిసిందే.