Telangana
Telangana Economy: దేశంలో ఎక్కువగా సంపాదించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందట. ఈ విషయాన్ని స్వయానా కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించిందట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చ ప్రారంభమైంది. దీంతో పాటు ఎకనమిక్ గా దేశాన్ని ముందుకు నడిపే రాష్ట్రంగా కూడా తెలంగాణ లీడ్ రోల్ పోషిస్తుందట. తలసరి ఆదాయంలో టాప్ లో ఉంది. నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (NSDP)లో కూడా అన్ని రాష్ట్రాల కంటే.. ఇక్కడి ప్రజలు టాప్‌లో ఉన్నారంట.
కేంద్ర ఆర్థిక శాఖ, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ.. పార్లమెంట్‌లో వెల్లడించిన డేటా.. ఈ వాస్తవాలను బయటపెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఎన్ఎస్‌డీపీ తలసరి ఆదాయం రూ.3,08,732 ఉండగా.. కర్ణాటక రూ.3,01,673, హర్యానా రూ.2,96,685 ఉంది.
ఆరేళ్లలో తెలంగాణ ఎన్ఎస్‌డీపీ తలసరి ఆదాయం… 72 శాతం పెరిగింది. అది 2017-18లో రూ.1,79,358 ఉంది. 2014-15తో పోలిస్తే ఎన్ఎస్‌డీపీ తలసరి ఆదాయం 151 శాతం పెరిగింది. ప్రజల తలసరి ఆదాయం 2014-15లో రూ.1.72 లక్షలు ఉండగా.. 2022-23లో రూ.3.12 లక్షలకు పెరిగింది. పెరుగుదల 81 శాతం ఉంది.
ఈ వివరాలను పరిశీలిస్తే తెలంగాణ ప్రజలు దేశంలోనే అత్యధికంగా ఆదాయం పొందడమే కాదు.. దేశానికి కూడా అంతే మొత్తంలో ఆదాయం సమకూరుస్తున్నారు. తెలంగాణ ఈ మధ్యనే అవతరించిన రాష్ట్రం. యంగ్ స్టేట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడి వనరులను వాడుకుంటూ ప్రజలు మంచిగా ఆర్జిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. ఫలితంగా గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు వెనక్కి వెళ్లిపోయాయి.