హైదరాబాద్ మహానగరంలో రోడ్లు కుంగిపోతున్నాయి. ఆమధ్య కాలంలో గోషామహల్ లో రోడ్డు కుంగి పెద్ద ఎత్తున ఆస్థి నష్టం జరిగింది. ఆ సంఘటన నుండి ఇంకా తేరుకోకముందే హిమాయత్ నగర్ లో మరో సంఘటన జరిగింది. హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 5 లో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. 10 అడుగుల మేర రోడ్డు కుంగిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి అలాగే ఓ వాహనం అందులో కూరుకుపోయింది. దాంతో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ……. ఆ తర్వాత తేరుకొని గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. రెండు నెలల్లో ఇది రెండో సంఘటన కావడంతో భాగ్యనగరం వాసులలో భయాందోళన నెలకొంది.
Breaking News