హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో ఆగ్రహించిన దుకాణదారులు వెంటనే తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసేసి బంద్ కొనసాగిస్తున్నారు. రాజాసింగ్ అరెస్ట్ కు నిరసనగా తమ దుకాణాలను మూసేస్తున్నట్లుగా ప్రకటించారు దాంతో హైదరాబాద్ లో యుద్ధ వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యే రాజాసింగ్ మీద గత ఏడాది కాలంగా 100 కు పైగా ఫిర్యాదులు అందడంతో ఆ పాత కేసులను తిరగదోడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. పాత కేసులను ఇప్పుడు తెరపైకి తీసుకురావడం ఏంటి ? అంటూ రాజాసింగ్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిరంతరం కోట్లాది రూపాయల బిజినెస్ జరిగే పాతబస్ట్ లోని కిషన్ గంజ్ , మొజాంజాహీ మార్కెట్ , అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున దుకాణాలు మూసేసారు వ్యాపారస్తులు.
Breaking News