Himanshu మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొడుకు హిమాన్షు ఈ మధ్య వార్తల్లో బాగా కనిపిస్తున్నాడు. గతంలో కూడా తాత (కేసీఆర్) సీఎం కాబట్టి సెక్రటేరియట్ మొత్తం ఫ్రెండ్స్ తో చెక్కర్లు కొట్టాడు. అదీ తాత లేని సమయంలో అప్పట్లో ఇది పెద్ద దుమారం రేగింది. కేసీఆర్ కూడా తిరిగితే తప్పేంటి అన్నట్లు బాహాటంగానే చెప్పాడు. అయినా ప్రతిపక్షాలు మాత్రం వదల్లేదు. ఆ సమయంలో తెగ యాగీ చేశాయి.
ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ చిన్నోడు ఒక పాఠశాలను దత్తత తీసుకున్నాడట. ఆ స్కూల్ కు సంబంధించి అన్ని వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల మొత్తం తిరిగిన హిమాన్షు తర్వాత నిర్వహించిన సమావేశంలో మాట్లాడాడు. ఈయన మాటలకు అటు తాత, ఇటు తండ్రి, ఇంకా బీఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఏమన్నాడంటే.
‘నీ చదువేదో నువ్వు చదువుకోక నీకెందుకు హిమాన్షు’ అని సొంత పార్టీ నాయకులే అంటున్నారట. మనుమడు మాట్లాడిన మాటలకు నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఎన్నికలు దగ్గరపడుతుండడం, ఇప్పటికే చెప్పుకోలేనంత వ్యతిరేకతతో బాధపడుతుంటే ఈయన వచ్చి ఇలా మట్లాడడం పార్టీకి మరింత ఇబ్బంది తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. కాగా, ప్రతిపక్షాలు కూడా ఆయన మాటలను బాగా వంట పట్టించుకుంటున్నారు. తాత పాలన అలా ఉంది మనుమడా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కేశవనగర్ లోని ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ మనుమడు దత్తత తీసుకున్నాడు. ఇందులో భాగంగా ఆయన పాఠశాలకు వచ్చాడు. వచ్చిన సందర్భంలో స్కూల్ ను మొత్తం కలియతిరిగాడు. సమస్యలను తెలుసుకున్నాడు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు తొలిసారి వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఆడ పిల్లలకు బాత్ రూమ్స్ లేవు, స్కూల్ మెట్లు కూడాసరిగా లేవు, ఇలాంటి పరిస్థితులు తాను ఎప్పుడూ చూడలేదు’ అన్నాడు. ఈయన మాటలకు నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.
తాత సీఎం, తండ్రి మినిస్టర్ స్కూల్స్ ను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిన్న పిల్లవాడికి ఉన్నంత బుద్ధి సీఎం, మంత్రులకు ఉంటే బాగుంటుందని ప్రతి పక్ష నాయకులు ఇప్పటికే కామెంట్లతో కేసీఆర్, కేటీఆర్ ను ఆడుకుంటున్నారు.