కేసీఆర్ సర్కారుకు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ సర్కారు సిట్ ను నియమించిన విషయం తెలిసిందే. అయితే సిట్ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదని భారతీయ జనతా పార్టీతో పాటుగా మరికొన్ని పిటిషన్ లు వచ్చాయి. దాంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది. సిట్ దర్యాప్తు ను పూర్తిగా పరిశీలించిన మీదట సిట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు ఆదేశించింది. అంతేకాదు తక్షణమే సిట్ రద్దు అవుతుందని , సిట్ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు సీబీఐకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే భారతీయ జనతా పార్టీ పిటిషన్ ను కూడా కొట్టివేసింది. అయితే సిట్ ను రద్దు చేస్తూ సీబీఐ విచారణకు ఆదేశించడంతో సిట్ రివ్యూకు వెళ్లనున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలు తప్పకుండా కేసీఆర్ సర్కారు కు ఇబ్బంది కరమైనవే అని చెప్పాలి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.