టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పూర్వపు వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అయిన డాక్టర్ రాజయ్య కు అలాగే అదే నియోజకవర్గం నుండి పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన కడియం శ్రీహరి మధ్య ఈ వైరం చాలాకాలంగా కొనసాగుతోంది. అయితే గతకొంత కాలంగా సైలెంట్ గా ఉంది వాతావరణం. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరి మధ్య వైరం మొదలైంది.
కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు పదేళ్ల పాటు మంత్రిగా కొనసాగాడు. అయితే అప్పట్లో తెలంగాణలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది. దాంతో ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే 361 మంది నక్సలైట్లను శ్రీహరి ఎన్ కౌంటర్ చేయించాడని తీవ్ర ఆరోపణలు చేసాడు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య. అంతేకాదు స్టేషన్ ఘనపూర్ నా అడ్డా. ఇక్కడ ఇతరులకు చోటు లేదు అంటూ పరోక్షంగా కడియం శ్రీహరికి హెచ్చరికలు జారీ చేసాడు.
అయితే ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు కడియం శ్రీహరి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు రాజయ్య. నీకు ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం దగ్గర చూసుకో అంతేకాని అవాకులు , చవాకులు పేలితే నీ చిట్టా మొత్తం నాదగ్గర ఉంది. దాన్ని బయట పెడతా జాగ్రత్త అని తీవ్ర హెచ్చరికలు చేసాడు కడియం శ్రీహరి.
Breaking News