దసరా రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించారు కేసీఆర్. అక్టోబర్ 5 న దసరా పండుగ కావడంతో దసరా అంటే విజయదశమి ……. విజయదశమి విజయాలకు చిహ్నం కాబట్టి ఆరోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక దసరా రోజున అంటే అక్టోబర్ 5 న హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. దసరా రోజున సమావేశంలో పలు అంశాలపై చర్చించిన తర్వాత జాతీయ పార్టీ BRS ను ప్రకటించనున్నారట. కేసీఆర్ సెంటిమెంట్ 6. అలాగే తెలంగాణలో శాసన స్థానాల సంఖ్య 119 కావడంతో అక్టోబర్ 5 న మధ్యాహ్నం 1.05 నిమిషాలకు కానీ లేదంటే 1. 19 నిమిషాలకు ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.