
రేపు అంటే నవంబర్ 15 న తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు TRS పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలు అలాగే రాష్ట్ర కార్యవర్గంలో అత్యవసరంగా భేటీ కానున్నారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు లేవు , అలాగే పార్లమెంట్ సమావేశాలకు కూడా సమయం ఉంది. అలాంటిది సడెన్ గా మోడీ వచ్చి వెళ్లిన వెంటనే TRS పార్టీ సమావేశం ఏర్పాటు చేసారంటే ఏదో మతలబు ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 12 న తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు కానీ తెలంగాణ ప్రభుత్వంపై మాత్రం యుద్ధమే అని ప్రకటించారు దాంతో ఆ విమర్శలకు సమాధానం చెప్పనున్నాడా ? లేక మునుగోడులో సాధించిన విజయం గురించి సాధించిన మెజారిటీ పై చర్చించనున్నారా ? కమ్యూనిస్ట్ లతో కలిసి పోవాల్సి ఉంటుంది కాబట్టి , అలాంటి సమయంలో వారికి కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది కాబట్టి కొంతమంది త్యాగానికి సిద్ధంగా ఉండాలని చెప్పడానికా ? లేదా ……. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారా ? ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.