ఖమ్మం జిల్లా తెల్దారు పల్లి లో దారుణ హత్యకు గురయ్యాడు టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య . కమ్యూనిస్ట్ నాయకుడు తమ్మినేని వీరభద్రం సోదరుడి వరుస అయ్యే తమ్మినేని కృష్ణయ్య చాలాకాలం పాటు తమ్మినేని వీరభద్రం కు అండగా ఉండేవాడు. కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగాడు. అయితే ఇటీవల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అనుచరుడిగా కొనసాగుతున్నాడు. పొన్నెకల్లు రైతు వేదిక దగ్గర జెండా ఎగురవేసి బైక్ పై వెళుతున్న సమయంలో కొంతమంది దుండగులు అతిదారుణంగా హత్య చేసారు. కృష్ణయ్య ని హత్య చేసిన అనంతరం రెండు చేతులను కూడా నరికేసి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. కృష్ణయ్య హత్య వార్త విన్న వెంటనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.
Breaking News