
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చింది సిట్ ( ప్రత్యేక దర్యాప్తు సంస్థ ). తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజ్ విషయంలో బండి సంజయ్ కు ఈ నోటీసులు ఇచ్చింది సిట్. మార్చి 24 న సిట్ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
పేపర్ లీక్ విషయంలో మీరు చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వడంతో పాటుగా ఆధారాలు ఉంటే మాకు సమర్పించాలని కోరింది సిట్. కాగా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉగాది రోజున విచారణకు హాజరు కావాలని కోరారు. మరి ఈ ఇద్దరు నాయకులు సిట్ ముందు హాజరు అవుతారా ? లేదా ? చూడాలి.