
కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి ఉరి వేసుకున్నాడని , కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల TSPSC నిర్వహించిన పలు పోటీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అందులో గ్రూప్ – 1 ప్రిలిమ్స్ కూడా ఒకటి. కాగా ఈ పరీక్షలు రాసాడు తెలంగాణ రాష్ట్రం లోని సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు.
అయితే పేపర్ లీక్ స్కామ్ లో భాగంగా పలు పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు నవీన్ . ఇప్పటికే ఖాళీగా ఉంటున్నానని ….. ఇప్పుడు పరీక్షలు రద్దు కావడంతో మళ్లీ పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు ? ఉద్యోగం వచ్చేది ఎప్పుడు ? అంటూ తీవ్ర ఉద్వేగానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కేసీఆర్ పై తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దని , వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి యువత కు అండగా ఉంటుందని భరోసా కల్పించాడు. ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబానికి కోటి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాడు.
కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1 కు ప్రిపేరైన సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై ఉరికొయ్యకు వేలాడాడు. కేసీఆర్ పై హత్యనేరం కింద కేసు పెట్టాలి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రూ.కోటి పరిహారం… https://t.co/YDDY1zw0hL pic.twitter.com/asgOp8UXD2
— Revanth Reddy (@revanth_anumula) March 18, 2023