వరంగల్ నగరంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల S.V.S Group of Institutions (హనుమకొండ ) లో UBLOOD App అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమం లో కాలేజ్ చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్ రావు , చైర్ పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి హర్షిని , ఫార్మసి principle వెంకటేశం మరియు కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భం గా JSW TV మరియు జై స్వరాజ్య టీవీ కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్
మాట్లాడుతూ… UBLOOD app అనేది కష్ట కాలంలో ప్రాణాపాయ స్టితిలో పేషెంట్ కి డోనర్ కి మద్య వారధిగా పని చేస్తుందని, ప్రతి ఒక్కరూ UBLOOD APP డౌన్లోడ్ చేసుకోవాలని, మరో 10 మందికి అవగాహన కల్పించాలని కోరారు. చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్ రావు మాట్లాడుతూ… app founder జగదీశ్ యలమంచలిని అభినందించారు.
రక్త దానం గురించి స్టూడెంట్స్ కి వివరించారు. , చైర్ పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి హర్షిని మాట్లాడుతూ… సోనుసూద్ లాంటి సామాజిక సేవ చేసే వ్యక్తి ఈ app కి బ్రాండ్ ambassador గా ఉండటంపై ఆనందం వ్యక్తం చేసారు. UBLOOD App founder జగదీశ్ యలమంచిలిని ప్రత్యేకంగా అభినందించారు, అంతే కాకుండా రక్త దానం గురించి స్టూడెంట్స్ కు అవగాహన కల్పించారు. జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్బంగా APP ని డౌన్లోడ్ చేసుకోవాలని , అత్యవసర సమయంలో APP సంజీవనిగా
ఉపయోగ పడుతుందని చెప్పారు.
ప్రతి ఒక్కరి మొబైల్ లో UBLOOD App ఉండాలని కోరారు. స్టూడెంట్స్ అందరు కుడా యు బ్లడ్ యాప్ విశిష్టత తెలుసుకొని అక్కడికక్కడే వాళ్ళ,వాళ్ళ మొబైల్స్ లో App Download చేసుకొని login అయ్యి మీడియాకి చూపించడం విశేషం. UBLOOD App గురించి తెలుసుకున్న విద్యార్దులు Download UBLOOD App Save Lives అని నినాదాలు చేస్తూ… తమ ఆనందాన్ని పంచుకున్నారు.