యు బ్లడ్ యాప్ పై ప్రశంసలు కురిపించారు ప్రముఖ వైద్యులు డాక్టర్ జగదీష్ కుమార్ కనుకుంట్ల. ” ప్రతీ రక్తదాత రేపటి రక్త గ్రహీత – అలాగే ప్రతీ రక్త గ్రహీత రేపటి రక్తదాత ” అంటూ సరికొత్త నిర్వచనం చెప్పారు డాక్టర్ జగదీష్ కుమార్. కాంటినెంటల్ హాస్పిటల్ , గచ్చిబౌలిలో సీనియర్ జనరల్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న జగదీష్ కుమార్ కనుకుంట్ల తాజాగా JSW , JaiSwaraajya యూట్యూబ్ ఛానల్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. …….. పలు అంశాలపై ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.
ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా డెంగ్యూ, వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే బయటి ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిదని సూచించారు.
ఇక UBlood App ని రూపొందించిన జై గారిని అభినందించారు. యు బ్లడ్ యాప్ తప్పకుండా అందరూ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన యాప్ , ఎందుకంటే ఈరోజుల్లో రకరకాల కారణాల వల్ల రక్తం అవసరమౌతోందని……. అవసరమైన సమయంలో రక్తదాతల కోసం ఎదురుచూడకుండా సమస్త సమాచారం ఈ యు బ్లడ్ యాప్ లో ఉందని………దాంతో రక్తదానం చేసేవాళ్ళ వివరాలతో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ఆలోచన చేసిన జై గారిని అలాగే ఈ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సోనూ సూద్ ను కూడా అభినందించారు. సోనూ సూద్ లాంటి పాపులర్ నటుడు UBlood App కు ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున యువత ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటుందన్నారు డాక్టర్ జగదీష్ కుమార్ కనుకుంట్ల. JSW & JaiSwaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు డాక్టర్ జగదీష్ కుమార్ కనుకుంట్ల.