
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్న తెలంగాణ ప్రభుత్వం పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏకంగా #UndemocraticKCR అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ చేస్తూ వైరల్ అయ్యేలా చేశారు. కేసీఆర్ వ్యతిరేకుల ట్వీట్ లతో ఏకంగా నెంబర్ వన్ గా దూసుకుపోతోంది. కేసీఆర్ మీద షర్మిల కార్యకర్తలకు , వైఎస్సార్ అభిమానులకు కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా……. 8 సంవత్సరాల క్రితం ఉస్మానియా ఆసుపత్రిని 200 కోట్లతో అధునాతనంగా నిర్మిస్తామని హామీ ఇవ్వడమే.
ఇప్పటికి కేసీఆర్ హామీ ఇచ్చి 9 సంవత్సరాలు కావస్తోంది కానీ బడ్జెట్ లో దాని ఊసే లేదు. పైసా విదిల్చలేదు దాంతో కేసీఆర్ సర్కారును టార్గెట్ చేస్తూ చలో ఉస్మానియాకు పిలుపునిచ్చింది షర్మిల. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుండి ఉస్మానియా ఆసుపత్రికి ర్యాలీగా కార్యకర్తలతో కలిసి వెళ్లాలని అనుకుంది. అయితే షర్మిల బయటకు రాకుండా లోటస్ పాండ్ లోనే అడ్డుకున్నారు పోలీసులు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగింది షర్మిల. ఇక ఇదే సమయంలో ఒకవైపు కార్యకర్తలు, మరోవైపు పోలీసుల తోపులాటలో వైఎస్ షర్మిల కిందపడింది. షర్మిల కిందపడటంతో అక్కడే ధర్నాకు దిగింది. కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగింది. ఉస్మానియా ఆసుపత్రికి 200 కోట్లు ఇచ్చి కొత్తగా నిర్మిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసాడని కేసీఆర్ పై విరుచుకు పడింది. షర్మిల అంటే రాజన్న బిడ్డ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని అందుకే తన పాదయాత్రను అడ్డుకున్నాడని ఇక ఇప్పుడేమో ఉస్మానియా ఆసుపత్రి కి వెళ్తుంటే అడ్డుకున్నాడని దుయ్యబట్టింది.






