కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మరణించాడు. దాంతో కిషన్ రెడ్డి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ బావ నర్సింహా రెడ్డి సైదాబాద్ లోని వినయ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల కొడుకే ఈ జీవన్ రెడ్డి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలాడు జీవన్ రెడ్డి. దాంతో హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
అయితే చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి మరణించాడు. చిన్న వయసులోనే గుండెపోటుకు గురవ్వడం , చనిపోవడంతో కిషన్ రెడ్డి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి మరణించాడన్న విషయం తెలుసుకున్న పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్న వయసులోనే పలువురు గుండెపోటుకు గురౌతున్నారు.