హైదరాబాద్ లో అలజడి చెలరేగింది. వీఆర్ఏ లు పెద్ద ఎత్తున తరలి వచ్చి అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. ఇంటలిజెన్స్ వైఫల్యం ఒక్కసారిగా ఈ సంఘటనతో బయటపడింది. అసలు వీళ్లంతా ఎలా వచ్చారు ? నిఘా విభాగం ఏమైంది అన్న టెన్షన్ నెలకొంది. వీఆర్ఏ లతో పాటుగా పలువురు టీచర్స్ కూడా ముట్టడికి భారీ ఎత్తున తరలి వచ్చారు.
ఇందిరా పార్క్ నుండి ఒక్కసారిగా వేలాది మంది రావడంతో షాకైన పోలీసులు వీఆర్లపై లాఠీ ఛార్జ్ చేసారు. దాంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఊహించని విధంగా పెద్ద ఎత్తున వీఆర్ఏ లు అలాగే టీచర్లు తరలి రావడంతో షాకైన మంత్రి కేటీఆర్ వెంటనే 10 మంది బృందాన్ని చర్చల కోసం పిలిచారు. ప్రస్తుతం కేటీఆర్ తో చర్చలు జరుగుతున్నాయి. అవి కొలిక్కి వస్తాయా ? లేదా ? అన్నది చూడాలి.