మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను చంచల్ జైలుకి తరలించారు. కడప జైలు నుండి ముగ్గురు నిందితులను హైదరాబాద్ కు తరలించిన పోలీసులు సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. అయితే సీబీఐ కోర్టు కేసును వచ్చేనెలకు వాయిదా వేసింది. దాంతో ముగ్గురు నిందితులను మళ్లీ కడప జైలుకు తరలించకుండా సికింద్రాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ముగ్గురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు అధికారులు.
Breaking News