
గతకొంత కాలంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై గురించి పెద్దగా చర్చ జరుగుతోంది. ఎవరు ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై ? అనే ఆసక్తి మొదలైంది. ఇక నెటిజన్లు అలాగే రాజకీయ నాయకులు ఎవరు ఈ పిళ్ళై అంటూ ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ పిళ్ళై ఎవరో తెలుసా……. ఓ వ్యాపారవేత్త. అంతేకాదు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కు స్నేహితుడు. కవిత కుటుంబంతో కలిసి పిళ్ళై పలుమార్లు పలు పర్యటనలు చేశారు.

ఆ పర్యటనల సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సీబీఐ దగ్గర అలాగే ఈడీ దగ్గర ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ప్రతినిధిగా మాత్రమే నేను వ్యవహారాలు నడిపాను కానీ నేను భాగస్వామిని కాను అని ఈడీ కి వివరించాడు. దాంతో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీలో కవితను విచారించనుంది ఈడీ. కవితను సింగిల్ గా విచారించడమే కాకుండా అరుణ్ రామచంద్ర పిళ్ళై ని కూడా కూర్చోబెట్టి ఎదురెదురుగా ప్రశ్నించనున్నారు. ఈ ప్రశ్నల తర్వాత కవిత చెబుతున్న విషయాలు ఈడీకి సంతృప్తి కలిగించకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది.