హైదరాబాద్ జంట నగరాలలోని మద్యం ప్రియులకు షాకిచ్చారు పోలీసులు. ఈనెల 7 న హోళీ పండుగ మహోత్సవం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంక్షలు విధించింది పోలీస్ డిపార్ట్మెంట్. హోళీ వేడుకలు అంటేనే మద్యంతో ముడిపడి ఉంటాయన్న విషయం తెలిసిందే. వినోదమైన ….. విషాదమైనా సరే మద్యం ఏరులై పారాల్సిందే. ఇక ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో మద్యం ప్రియులు ఎక్కువ. అంతేకాదు అసలే ఎండాకాలం కూడా వచ్చేసింది. దాంతో హోళీ పండుగను ఘనంగా చేసుకోవడంతో పాటుగా అదే జోష్ లో మద్యం తీసుకోవడం సహజం.
అయితే హోళీ వేడుకలు ఒక్కోసారి శృతి మించి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ హోళీ పండుగకు ముందు రోజు నుండే మద్యం షాపులను మూసి వేస్తుంటారు. దాంతో రేపు సాయంత్రం నుండి మద్యం షాపులు మూసివేయనున్నారు. ఇక మళ్లీ 8 వ తేదీన మాత్రమే మద్యం షాపులు తెరవనున్నారు. దాంతో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త చర్యగా ముందే మందు కొనుక్కునే పనిలో పడతారు. అలాంటి వాళ్ళ కోసమే ఇలా ముందస్తు ప్రకటన అన్నమాట.