
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సీతారాం ఏచూరితో పాటుగా పెద్ద ఎత్తున మహిళా నాయకులు పాల్గొన్నారు. లోక్ సభలో భారతీయ జనతా పార్టీకి పూర్తి సంఖ్యాబలం ఉన్నందున వచ్చే పార్లమెంట్ సమావేశాలలో మహిళాబిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసింది కవిత. ఆకాశంలో సగమైన మహళలకు చట్ట సభల్లో కూడా సగం వాటా దక్కాల్సిందే నని డిమాండ్ చేసింది.
బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించేంత వరకు పోరాటం ఆపేది లేదని కుండబద్దలు కొట్టింది కవిత. మహిళా బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్ష కు మద్దతుగా దేశ వ్యాప్తంగా ఉన్న 18 పార్టీల నాయకులు , మహిళా నాయకురాళ్లు తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో నాయకులు , కార్యకర్తలు తరలి రావడంతో జంతర్ మంతర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.