
న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో 50 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ను అభినందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వియత్నాం బాక్సర్ నుయెన్ పై 5-0 తేడాతో సంచలన విజయం సాధించింది నిఖత్ జరీన్.
జరీన్ వరుస విజయాలతో తెలంగాణకు అలాగే భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిందని కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని , అందులో భాగంగానే పలువురు తెలంగాణ క్రీడాకారులు జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో విజయాలను కట్టబెడుతున్నారన్నారు.