వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ను అరెస్ట్ చేసారు వరంగల్ పోలీసులు. వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున విషయం తెలిసిందే. నిన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసింది షర్మిల దాంతో ఈరోజు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ షర్మిల కారవాన్ ను తగులబెట్టారు.
అంతేకాదు షర్మిల కాన్వాయ్ లోని పలు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందేమో అనుకున్నారు పోలీసులు. కానీ పరిస్థితి దారుణంగా ఉండటంతో షర్మిల పాదయాత్ర చేయడం వల్ల మరిన్ని ఆందోళనకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున షర్మిలను ముందస్తు చర్యలో భాగంగా అరెస్ట్ చేసారు. దాంతో పాదయాత్ర అర్దాంతరంగా రద్దయ్యింది.