
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లనుంది. తనపై జరిగిన దాడికి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని గవర్నర్ డాక్టర్ తమిళ్ సై కు వివరించనుంది . అలాగే హైదరాబాద్ లో పోలీసులు వ్యవహరించిన తీరును కూడా వివరించనుంది.
ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనలో షర్మిల క్యారవాన్ ను దగ్ధం చేసిన విషయం తెలిసిందే. నా బస్సు తగులబెట్టిన వాళ్లపై కేసులు లేవు కానీ నా వెంట ఉన్న వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని మండిపడుతోంది వైఎస్ షర్మిల.
ఇక షర్మిల పై జరిగిన దాడిలో ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు కూడా తీవ్ర విచారం వెలిబుచ్చారు. అంతేకాదు గవర్నర్ తమిళ్ సై కూడా షర్మిల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే గవర్నర్ తో షర్మిల సమావేశం కానుండటంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గతకొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే.