మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. వైఎస్. వివేకా కూతురు డాక్టర్ సునీత తన తండ్రి హత్య కేసు విచారణ సరైన దిశలో సాగడం లేదని భావించి ఏపీ నుండి వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో సునీత తరుపు లాయర్ వాదనలు విన్న సుప్రీం కోర్టు ఏపీ నుండి తెలంగాణకు బదిలీ చేసింది. దాంతో తెలంగాణ లో సీబీఐ వివేకా హత్య కేసు విచారణ కొనసాగించనుంది.
2019 లో ఏపీలో ఎన్నికలకు ముందు వైఎస్. వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అయితే ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి నుండి వివేకా హత్య కేసు విచారణ సరైన దిశలో సాగడం లేదని డాక్టర్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.