
CM KCRదళిత బంధు స్కీం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకమైన పథకం. ఈ పథకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక నజర్ కూడా పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా లబ్ధిదారులనూ ఎంపిక చేసిన స్కీంను వర్తింపజేశారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్న ఈ స్కీం వల్ల కేవలం బీఆర్ఎస్ నేతలు,ఆయా సెగ్మెంట్లలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్న నాయకులు మాత్రమే లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి.
ఈనేపథ్యంలోనే దళిత బంధు స్కీం వర్తింపుపై పెద్ద ఎత్తున ఆరోపణలోచ్చాయి. స్వంత పార్టీ నేతలే ఈ స్కీం వర్తింపు విధానాన్ని తూర్పార పట్టారు. దళిత బంధు స్కీం ఇంప్లిమెంట్ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు చేతి వాటం ప్రదర్శించారని గుస్సా అయ్యారు. దళిత బంధు అమలు విషయంలో ఎమ్మెల్యేలు లక్షలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షకు ముప్పై వేల చొప్పున బీఆర్ఎస్ శాసన సభ్యులు కమీషన్లుగా తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. దీంతో దళిత బంధు వ్యవహారం చేయబట్టి చాలా మంది అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్‌తో అంటీ ముట్టనట్లు ఉంటూ వస్తున్నారు.
అయితే దళిత బంధు విషయం రచ్చ రచ్చ అవుతుండడంతో..ఈ వ్యవహారంలో అసలు దొంగలు ఎవరనే విషయంపై సీఎం కేసీఆర్ గురువారం క్లారిటీ ఇచ్చారు. దళిత బంధు స్కీం వర్తింపులో అసలు దొంగలు తమ పార్టీ ఎమ్మెల్యేలేనని తేల్చి చెప్పారు. గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కమీషన్ చిట్టా మొత్తం తన దగ్గర ఉన్నట్లు వెల్లడించారు. దళిత బంధులో చాలా ఎమ్మెల్యేలు రూ.3 లక్షలు కమీషన్ రూపంలో దండుకున్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇంటి దొంగలను యాజమానే పట్టించినట్లు స్వంత పార్టీలో కమీషన్లు దండుకున్న వారిని సీఎం కేసీఆర్ పట్టించారన్న మాట.






