
ఏపీ లో రెండు పార్టీల వైరం కాస్త అభివృద్ధి మీద పడుతుంది.. మేము చేసిందే అభివృద్ధి వైసీపీ వాళ్ళు చేసింది ఏమి లేదు అనీ టీడీపీ నాయకులు.. టీడీపీ వాళ్ళు ఎం చేశారు మేం అధికారంలోకి వచ్చాకే రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నాము అనీ వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు..
టిడ్కో ఇళ్లను ప్రారంభించినది చంద్రబాబు కానీ ఆ ఇళ్లను అయన హయాంలో పూర్తి చేయలేదు.. ఇప్పుడు జగన్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు గొడవకు కారణం అవుతుంది… మేమే మొదలు పెట్టామని టీడీపీ… కాదు మేము పూర్తి చేశామని వైసీపీ నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు…
టీడీపీ హయంలో అదానీ పెట్టుబడులు కోసం రాష్టానికి వస్తే మంచివాడు.. వైసీపీ హయాంలో రాష్టానికి అదానీ మోసగానిలా చెబుతున్నారు.. అప్పుడు మంచిగా కనిపించిన అదానీ ఇప్పుడు మోసగానిగా చిత్రికరిస్తున్నరు. ఇదే ఏపీ లో ఉన్న ఉన్న దరిద్రం.. రాష్టానికి పెట్టుబడులు రావడం ముఖ్యం కానీ మా హయాంలో వస్తే మంచిది.. వేరే పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టుబడులు కావు అన్నట్టు చూడడం ఏపీ లో ఉన్న దరిద్రం.






