brs రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకు వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల ఢిల్లీ టూర్ తర్వాత మరింత వేగం పుంజుకున్నాయి. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా సందర్భాల్లో ముందస్తుకు వెళ్లేది లేదని కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్పారు. కానీ రాష్ట్రంలో ఇంటలీజెంట్ హెచ్చరికలు, సర్వేల ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ కు ముందస్తే శరణ్యంలా అనిపిస్తుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందడంతో తెలంగాణలో ఆ పార్టీ ఊపందుకుంది. ముఖ్యమన నాయకుల చేరికలు పార్టీ సమీకరణలు రోజు రోజుకు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని భావించిన కేసీఆర్ ముందస్తుకు వెళతారన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారని, ఆయన పర్యటనలో దాదాపు 80 మందితో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ కూడా రెడీ అయ్యిందని పార్టీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. ఇక షెడ్యూల్ కంటే ముందే అసెంబ్లీని రద్దు చేసే దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
కేసీఆర్ అసెంబ్లీ గనుక రద్దు చేస్తే సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. అయితే ఐదు రాష్ట్రాలతో కలిసి తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే, తెలంగాణలో ముందస్తు నిర్వహించాలని ఆ మేరకు ఈసీ కూడా సన్నాహాలు చేసేందుకు ఇప్పటికే కేంద్రంతో కేసీఆర్ రహస్య సంప్రదింపులు జరిపారని, ఆ విధంగా ఈసీ కూడా ఎన్నికల షెడ్యూల్ మార్చుకుంటుందని తెలుస్తోంది. అన్నీ కలిసి వస్తే తెలంగాణలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా రెండు నెలలు మాత్రమే గడువు ఉంటుంది. ఈ లోపు ఇతర పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) తమ సమీకరణలను మార్చుకునే సమయం దొరకకుండా చూడాలని కేసీఆర్ బిగ్ స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నట్లు తెలుస్తోంది.