
KCR: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేసే నియోజకవర్గమేది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. అదేంటి కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా..మళ్లీ కొత్త సెగ్మెంట్ ఏదని అనుకోవచ్చు కొందరు. కానీ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కాలుకు బలపం కట్టుకొని పక్క రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత ఆయన ఏపీ,మహారాష్ట్ర,కర్నాటకల్లో యాక్టివ్‌గా ఉండబోతున్నట్లు ప్రకటించారు. అయితే కర్నాటక శాసన సభా ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ బరిలో ఉంటుంద నుకున్నప్పటికీ నామినేషన్స్ గడువు ముగిసిపోవడం..ఆయనకు కన్నడ నాటపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో..ఆరాష్ట్రంపై ప్రస్తుతానికి ఆశలు వదులుకున్నారు.
ఇక మహారాష్ట్రపై మాత్రం కేసీఆర్ ప్రస్తుతానికి సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. వరుసగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో రెండు సభలు పెట్టారు. మూడో సభను ఈనెలలోనే ఔరంగాబాద్‌లో పెట్టెందుకు సిద్ధమవుతు న్నారు. తద్వారా ఇక్కడ ఎంతో కొంత పట్టు సాధించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఊబలాట పడుతున్నారు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పోటీ చేయాలంటే తప్పని సరిగా ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే పదవిని తప్పనిసరిగా వదుకోవాల్సిందే. అదే జరిగితే అసలు రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి కేసీఆర్ బరిలో ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గతంలో కేసీఆర్ మహబూబ్‌నగర్,కరీంనగర్,మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఒక్క పాలమూరు తప్ప మిగతా రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ మంచి మెజార్టీనే సాధించారు. ఇప్పుడు న్న పరిస్థితుల్లో ఆయన పాలమూరు నుంచి మళ్లీ పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితులుండొచ్చని బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. దక్షిణ తెలంగాణకు కేసీఆర్ సర్కార్ పెద్దగా చేసిందేమీ లేదనే డిస్కషన్ ఉంది. ఇక్కడ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్,కల్వకుర్తి ఎత్తిపోతలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు దిండి,నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగు నీటి అందించలేకపోయారు.
మరోవైపు కరీంనగర్ లోక్ సభ పరిధిలోనూ ఇవే పరిస్థితులున్నాయి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ఈ జిల్లాను కేసీఆర్ అస్సలు పట్టించుకోలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. దీంతో కరీంనగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు కూడా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆసక్తిగా లేరనే డిస్కషన్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే తన స్వంత సెగ్మెంట్ మెదక్ నుంచే పోటీ చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా సునాయా శంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందవచ్చనే అంచనాలో కేసీఆర్ ఉన్నట్లు డిస్కషన్ నడుస్తోంది.






