34.7 C
India
Friday, April 10, 2026
More

    ఐ ప్యాక్ టీమ్ జగన్ నీ నిండా ముంచిందా..? ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కి ఝలక్ ఇవ్వనున్నరా…!

    Date:

    YS Jagan furious on IPAC team
    YS Jagan furious on IPAC team

    ఐ ప్యాక్ టీం వైసీపీని 2024లో గెలిపించేందుకు వ్యూహకర్తగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఐప్యాక్ వ్యూహాలే వైసీపీని గెలిపించాయన్న భ్రమలలో ఉన్న వైసీపీ అధినాయకత్వం అయిదేళ్ళ పాలన తరువాత కూడా యాంటీ ఇంకెంబెన్సీని తట్టుకుని మరోమారు గెలిపించే బంపర్ వ్యూహం ఐ ప్యాక్ టీం ఇస్తాయనుకుంది. అందుకే రెండేళ్ళుగా ఐ ప్యాక్ టీం కి నిధులు వెల్లువలా పారిస్తోంది.

    పార్టీ కోసం జెండా ఎత్తిన క్యాడర్ లీడర్ కంటే ముద్దుగా ఐ ప్యాక్ టీం ని చూసుకుంటోంది. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా కధ నడుపుతోంది. ఇంతకీ ఐ ప్యాక్ టీం ఏమైనా పురోగతి సాధించిందా అంటే ఎన్నికలకు ఏడాది ముందే వైసీపీ ఆర్భాటాన్ని బయటేసి మరీ బొక్కోబోర్లా పడేసింది. వైసీపీ వీక్ నెస్ ని విపక్షాలకు నగ్నంగా చూపించేసి ప్రత్యర్ధులకు పదునైన అస్త్రాన్ని ఇచ్చేసింది.

    మరి ఇంతలా నమ్ముకుని సొమ్ములు ధారబోస్తున్న ఐ ప్యాక్ టీం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇంత నేలబారుడు వ్యూహాలను అమలు చేయడం పైన వైసీపీ అధినాయకత్వం మండిపడుతోంది. ఆ చవకబారు వ్యూహాలు ఏంటి అంటే ఓటర్లను డబ్బులిచ్చి కొనడం పోలింగ్ వేళ అవకతవకలకు పాల్పడడం ఇలా ఏదో ఒకటి మ్యానేజ్ చేస్తే ఓట్లు గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడిపోతాయని వైసీపీ అధినాయకత్వానికి సూచిందిందట.

    తీరా చూస్తే ఏమి జరిగింది. బోలెడన్ని నిందలు విమర్శలు విపక్షాల నుంచి నెత్తికెత్తుకున్న వైసీపీకి వ్రతం చెడింది ఫలితం దక్కలేదు. పైగా దారుణమైన పరాజయం ఎదురైంది. దాంతో వైసీపీ అధినేత జగన్ మండిపోతున్నారు అని అంటున్నారు. పట్టభద్రుల దగ్గర దిగజారుడు వ్యూహాలు పనిచేవన్న్న అతి చిన్న లాజిక్ ని ఐ ప్యాక్ మిస్ అవడమే ఇక్కడ కీలకమైన పాయింట్. మరో వైపు చూస్తే విద్యావంతులలో అసంతృప్తి ఉంది అన్న విషయాన్ని పసిగట్టలేని ఐ ప్యాక్ సర్వేలు ఎందుకు తగలెయ్యడానికా అన్న ఆవేశం కూడా వైసీపీ నేతలలో వ్యక్తం అవుతోంది.

    గత రెండేళ్ళుగా విద్యావంతులలో మార్పు కనిపిస్తోంది. వారు తన నోటికి పని చెబుఇతున్నారు. చాలా చోట్ల వారి వాయిస్ వినిపిస్తోంది. అలాంటపుడు ఆ కోపాన్ని గుర్తించి తగిన విధంగా సలహాలు ఇస్తే వైసీపీ ఎంతో కొంత సర్దుకునేది. లేకపోతే అసలు పోటీ నుంచి తప్పుకుని గమ్మున ఉండేది. అలా కాకుండా మనమే గెలిచేస్తామంటూ తప్పుడు స్ట్రాటజీలతో ఇపుడు కొంప ముంచారని వైసీపీ పెద్దలు ఐ ప్యాక్ మీద మండిపడుతున్నారంటే తప్పేముంది.

    ఇదిలా ఉండగా పట్టభ్ద్రుల ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టడం మీద జగన్ ఐ ప్యాక్ టీం తో మీటింగ్ పెట్టి గట్టిగా తలంటారు అన్న గుసగుస పార్టీ నుంచి వినిపిస్తోంది. మీరు కోరినవి అన్నీ ఇస్తున్నాను నిధులకు ఢోకా లేదు ఇంత చేసినా కూడా ఒక చిన్న ఎన్నిక విషయంలో సరైన వ్యూహాన్ని రూపొందించకపోతే ఎలా అంటూ జగన్ ఫైర్ అయ్యారని అంటున్నారు. మీరు ఇదే తీరున వ్యవహరిస్తే మరో దోవ చూసుకుంటామని అన్నట్లుగా చెబుతున్నారు.

    ఇదిలా ఉంటే విద్యావంతులలో కోపం ఉంటే వారిని దగ్గర చేర్చుకోవడానికి ఏవైనా పధకాలను అమలు చేయమని జగన్ కి సూచించి ఎన్నికలకు వెళ్ళేలా సలహాలు ఇవ్వలేని ఐ ప్యాక్ స్ట్రాటజీలలో మాస్టర్ మైండ్ ఎలా అవుతుంది అని అంటున్నారు. దాని మీద ఇంతకాలం వైసీపీ నేతలలోనే నిరసన ఉండేది. అయితే ఎన్నికలకు ఏడాది ముందు తన వ్యూహా రచనా చాతుర్యాన్ని పాండిత్యాన్ని విప్పి చెప్పుకున్న ఐ ప్యాక్ టీం ని ఇంకా వైసీపీ భరిస్తుందా లేక తాను అనుకున్నట్లుగానే వేరే దోవ చూసుకుంటుందా అన్నది చూడాలి

    ఇక్కడ ఒక విషయం ఉందిట. ఉత్తరాదిన పీకే టీం మీద ఒక ఘాటైన సెటైర్ ఉంది. ఆయన ఎపుడూ గెలిచే పార్టీకే స్ట్రాటజీలు ఇస్తారని అంటే ఆ గెలుపులో క్రెడిట్ అప్పనంగా వేసుకుంటారన్న మాట. మరి ఏటికి ఎదురీదే పార్టీలకు బ్రహ్మండమైన వ్యూహాలను ఇచ్చి గెలిపించిన దాఖలాలు లేని ఐ ప్యాక్ టీం తో వైసీపీ ముందు ముందు అడుగులేస్తే 2024లో ఫలితాలు ఎలా వస్తాయో మూడు ఎమ్మెల్సీలు చెప్పేశాయి అంటున్నారు. ఇక డెసిషన్ జగన్ చేతిలోనే ఉందా అంటే ఎస్ అనాలేమో.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    CM Jagan : సిఎం జగన్ పై దాడి కేసులో అప్ డేట్

    - నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు CM Jagan : సిఎం జగన్...

    Police Statement : జగన్ పై దాడి కేసు.. పోలీసుల ప్రకటన

    Police Statement : సిఎం జగన్ పై రాయితో దాడి చేసిన...

    CM Jagan : సీఎం జగన్ వస్తున్నారంటే.. చెట్లపై వేటు

    CM Jagan Tour : సీఎం జగన్ పర్యటిస్తున్నారంటే చాలు.. ఆయన...