
Times Now Survey: మోడీ సీటు చిరగదని తేలిపోయింది.. జగన్ కుర్చీ కాపాడుకుంటాడని అర్థమైంది. కానీ ఎటొచ్చి మన కేసీఆర్ సారే కాళ్ల కింద కుర్చీ కదలడం ఖాయమని తాజా సర్వే తేల్చేసింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే సర్వేలు హోరెత్తుతున్నాయి..
లోక్ సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు అన్న దానిపై ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ టైమ్స్ నౌ నవభారత్ సర్వే తేల్చేసింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం బీజేపీదేనని తేలిపోయింది. 2024 వరకూ బీజేపీకే సానుకూలత ఉందని టైమ్స్ నౌ ఛానెల్ తేల్చింది. ప్రజల మద్దతు విషయంలో బీజేపీకే ఎక్కువ ఉందని.. బ్రాండ్ మోడీ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని తేలింది.
* టైమ్స్ నౌ సర్వే ప్రకారం..
– బీజేపీకి 292-338 సీట్లతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.
– కాంగ్రెస్ పార్టీకి 106-144 వరకూ వస్తాయని వెల్లడించింది..
-ప్రధాన మంత్రి మోడీనే..
ఈ సర్వేలో ప్రధానంగా ప్రధానమంత్రి ఎవరు అని? అంటే అందరు ఓటర్లు మరో మాటకు తావు లేకుండా మోదీకి జై కొట్టారు. ప్రధానికి అనుకూలంగా 64 శాతం మంది ఓటు వేశారు. రాహుల్ గాంధీకి 13 శాతం మంది సమ్మతం తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ కు 12%, నితీష్ కుమార్ 6%, కేసీఆర్ కు 5% ఓట్లు వచ్చాయి.
ఇక ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ కూర్చోవాలని 29%, అరవింద్ కేజ్రివాల్ 19%, మమతా బెనర్జీ 13%, నితీష్ కుమార్ 8%, కేసీఆర్ 7%, దాచిన రుస్తమ్ తో 24% మంది తమ నిర్ణయం తెలిపారు. ఇక ఈ సర్వేలో 2024 లో బిజెపి 300 సీట్లకు పైగా గెలుస్తుందా అని ప్రశ్నించినప్పుడు.. దానికి 42 శాతం మంది అవును అను సమాధానం చెప్పారు. అదే సమయంలో 26 శాతం మంది 300 సీట్లు కష్టమని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల నాటికి తేలిపోతుందని 19 శాతం మంది తేల్చి చెప్పారు. 13 శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు.
ఈ సర్వేలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని తేలిపోయింది. అయితే ఈ సర్వే ఫలితాలు నిజం కావాలని లేదు. అయితే ఈ సర్వే పై భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ఫేక్ సర్వే అని కొట్టి పడేస్తున్నారు.
మరోవైపు ఏపీలో జగన్ పార్టీ హవా కొనసాగుతుందని టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన సర్వేలో వెళ్లడైంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఆంధ్ర ప్రజలు మరొకసారి జగన్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో మాత్రం కేసీఆర్ కు 5 శాతం సీట్లు మాత్రమే అనడంతో ఆయనకు రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో కొంచెం కష్టమేనన్నది సర్వేలో తేలింది.






