రామంతాపూర్ నారాయణ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. నారాయణ స్వామి అనే ఇంటర్ విద్యార్థి 16 వేలు ఫీజు బకాయి పడ్డాడు. అతడు ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్ చేయడానికి నారాయణ కాలేజ్ నుండి టీసీ ఇవ్వమని కోరాడు నారాయణ స్వామి అనే స్టూడెంట్. అయితే తన వెంట తండ్రి తో పాటుగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ కూడా వచ్చారు.
అయితే 16 వేలు బకాయి పడినప్పటికీ మేము పరీక్ష రాసేలా చూశామని , ఇక టీసీ ఇవ్వాలంటే మాత్రం బకాయి ఉన్న డబ్బులు కడితేనే ఇస్తామని స్పష్టం చేసాడట. దాంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ ఎక్కువ కావడంతో స్టూడెంట్ లీడర్ సందీప్ పెట్రోల్ తీసుకొని పోయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సందీప్ తో పాటుగా కాలేజ్ ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి , ఏవో అశోక్ రెడ్డి లకు గాయాలయ్యాయి. అలాగే అక్కడే ఉన్న మరికొంతమందికి కూడా గాయాలు అయ్యాయి. గాయాలైన వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Breaking News