
Abirami Adopted Child : మలయాళ నటి అభిరామి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈమె నటిగా రాణిస్తుంది.. అభిరామి ప్రముఖ రచయిత పవనన్ మనవడు రాహుల్ పవనన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఈ జంట పెళ్లి 2009లోనే జరిగింది.. అప్పటి నుండి ఈ స్టార్ కపుల్ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు..
అయితే వీరు ఎంత అన్యోన్యంగా ఉంటున్నా కూడా ఒక లోటు మిగిలి పోయింది. అది ఏంటి అంటే ఈ జంటకు ఇప్పటికి పిల్లలు పుట్టలేదు.. పెళ్లి జరిగి 14 ఏళ్ళు అవుతున్న కూడా ఇంకా పిల్లలు లేకపోవడంతో ఈ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వీరు చేసిన ఈ పనికి అందరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు..
ఇంతకీ ఈ జంట చేసిన పని ఏంటా అని ఆలోచిస్తున్నారా.. నిన్న మదర్స్ డే సందర్భంగా ఈ జంట చేసిన పనికి అందరు వీరికి అభినందనలు చెబుతున్నారు. ఈ జంట పిల్లలు లేకపోవడంతో ఒక చిన్నారి తల్లిని దత్తత తీసుకున్నారు.. ఈ విషయాన్ని నిన్న మదర్స్ డే సందర్భంగా చెబుతూ పిక్స్ ను షేర్ చేసింది.
దీంతో ఈ జంటను అందరూ అభినందిస్తున్నారు. ఇది మంచి నిర్ణయం అని పొగిడేస్తున్నారు. ఇదిలా ఉండగా అభిరామి తెలుగులో చెప్పవే చిరుగాలి, థాంక్యూ సుబ్బారావు, అమర్ అక్బర్ ఆంటోనీ, చార్మినార్ వంటి సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది.