
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. నాలుగు రోజుల క్రితమే ఢిల్లీలో భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుండి తేరుకోక ముందే మరోసారి ఈరోజు భూమి కంపించింది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.4 గా నమోదు అయ్యింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో బయటకు పరుగులు తీశారు ప్రజలు. నేపాల్ , ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది