
ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్న నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూశారు. ఎన్టీఆర్ కు నలుగురు కుమార్తెలు కాగా చనిపోయిన ఉమామహేశ్వరి నాలుగో కుమార్తె. హఠాత్తుగా ఆమె మరణించడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉమామహేశ్వరి మరణించిందన్న వార్త తెలియడంతో నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు.