సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ కు డాక్టరేట్ ప్రధానం చేసింది కె ఎల్ యూనివర్సిటీ. తెలుగు భాష అభివృద్ధితో పాటుగా సాహిత్య , సాంస్కృతిక , కళా రంగాలలో విశిష్ట సేవలు అందించిన వాళ్లని గౌరవించాలని భావించిన కె ఎల్ యూనివర్సిటీ కూచిభొట్ల ఆనంద్ కు డాక్టరేట్ ప్రధానం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కూచిభొట్ల ఆనంద్.
కె ఎల్ యూనివర్శిటీ పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది అందులో కూచిభొట్ల ఆనంద్ తో పాటుగా సినీ నటులు అలీ , ఇస్రో చైర్మన్ శివన్ , వోల్వో మేనేజింగ్ డైరెక్టర్ కమల్ బాలి , ప్రముఖ పండితుడు చాగంటి కోటేశ్వర్ రావు లకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసారు. తనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు కూచిభొట్ల ఆనంద్.