26.2 C
India
Friday, July 19, 2024
More

  DR. SHIVAKUMAR AANAND: ఫోటోగ్రఫీ అంటే ప్రాణం : డాక్టర్ శివకుమార్ ఆనంద్

  Date:

  dr-shivakumar-aanand-photography-is-life-dr-shivakumar-anand
  dr-shivakumar-aanand-photography-is-life-dr-shivakumar-anand

  ఫోటోగ్రఫీ సభ్యసమాజం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించలేని సమయంలో ఒక్క ఫోటోతోనే అనంతమైన భావజాలాన్ని ప్రదర్శించే సత్తా కేవలం ఫోటోగ్రఫీకి మాత్రమే ఉంది. కష్టజీవుల వెతలను వ్యక్తం చేయాలన్నా , యువతీయువకుల ప్రేమను స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలన్నా …… యుద్ధం , ప్రేమ , పగ , ప్రతీకారం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ని కథనం రూపంలో వెల్లడించే కన్నా …… ఒక్క ఫోటో తోనే ప్రజల మనసును గెలిచే సత్తా కేవలం ఫోటోగ్రఫీలోనే ఉంది. ఇందుకు తార్కాణంగా ఎన్నో ….. ఎన్నెన్నో సంఘటనలు ఉదాహరణగా నిలిచాయి …… చరిత్ర సృష్టించాయి. చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసాయి.

  తాజాగా అమెరికాలో JUTUH USA లోని న్యూజెర్సీ రాష్ట్రంలో రెండో వార్షికోత్సవ పూర్వ విద్యార్థులు సమ్మేళనం జరిగింది. కాగా ఇదే సమయంలో JNTUH స్థాపించి 50 సంవత్సరాలు అవుతుండటంతో  గోల్డెన్ జూబ్లీ వేడుకలను అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ వేడుకలలో అన్ని రాష్ట్రాలలోని  ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు. కాగా ఆ వేడుకకు JNTUH వైస్ ఛాన్స్ లర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ శివకుమార్ ఆనంద్ ని వేదిక మీదకు ఆహ్వానించి ఆయనకు ఫోటోగ్రఫీ పట్ల ఉన్న మక్కువపై ప్రశంసల వర్షం కురిపించారు. యూనివర్సిటీ చరిత్రలోనే ఫోటోగ్రఫీ కోర్స్ చేసిన వాళ్ళు అరుదు అలాంటిది……  ఆరోజుల్లోనే ఫోటోగ్రఫీ చేయాలనే సంకల్పం కలిగిన శివకుమార్ ఆనంద్ నిజంగా అభినందనీయుడు. అలాంటి అరుదైన ఘనత సాధించిన శివకుమార్ ఆనంద్ ను తప్పకుండా అభినందించాల్సిందే అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు డాక్టర్ శివకుమార్ ప్రతిభను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. JNTUH గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో నాకు సన్మానం జరగడం జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసారు డాక్టర్ శివకుమార్ ఆనంద్ .

  ప్రవాసాంధ్రులు అయిన డాక్టర్ శివకుమార్ ఆనంద్ కు  ఫోటోగ్రఫీ అంటే ఎనలేని మక్కువ. అసలు నిజం చెప్పాలంటే……  ఫోటోగ్రఫీ అంటే ప్రాణం.  అంతగా ఫోటోగ్రఫీ పై మక్కువ ఏర్పడటంతో హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 1988 లో ఫోటోగ్రఫీ కోర్స్ చేసారు. ఆరోజుల్లో భారతదేశంలో ఏ యూనివర్సిటీలో కూడా ఫోటోగ్రఫీ కోర్స్ లేదు …… మొదటగా JNTUH లో మాత్రమే ఫోటోగ్రఫీ కోర్స్ ప్రవేశపెట్టగా దానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అయితే ఆ పోటీలో 6 వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించారు డాక్టర్ శివకుమార్ ఆనంద్. PHD పూర్తి చేసిన తర్వాత ఫోటోగ్రఫీ కోర్స్ లో చేరిన శివకుమార్ ఆనంద్ ను అప్పటి ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ అందరి ముందు వేదిక మీదకు పిలిచి అభినందించడం విశేషం.

  మహానటులు , మహా నాయకుడు నందమూరి తారకరామారావు దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్ గా కొంతకాలం పనిచేసారు.
  నందమూరి తారకరామారావు దగ్గర పనిచేయడంతో మరిన్ని మెళుకువలు నేర్చుకోవడమే కాకుండా క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా తర్ఫీదు పొందారు. ఆ తర్వాత ”ఆంధ్రభూమి” , ”దక్కన్ క్రానికల్” , ”ఉదయం” , ”వార్త” , ” ఆంధ్రప్రభ ”, ” ఇండియన్ ఎక్స్ ప్రెస్ ” ,”ఆంధ్రజ్యోతి”  తదితర దిన పత్రికలలో 10 సంవత్సరాల పాటు ఫోటో జర్నలిస్ట్ గా పనిచేసారు.

  ఫోటోగ్రఫీలో అందెవేసిన చెయ్యి కావడంతో అచిర కాలంలోనే డాక్టర్ శివకుమార్ ఆనంద్ కు ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. శివకుమార్ ఆనంద్ తీసిన పలు ఫోటోలను ” ది వీక్ ” అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో కవర్ పేజీలపై వేసేవారంటే ఆయన సృజనాత్మకత ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

  అమెరికాలో స్థిరపడిన డాక్టర్ శివకుమార్ ఆనంద్ గత 28 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీలో విశిష్ట సేవలు అందిస్తున్నారు. అంతకుముందు 1994లో ప్రముఖ నటి రోజా నేతృత్వంలోని ” సూపర్ హిట్ ” అనే సినిమా మ్యాగజైన్ లో సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కొంతకాలం పనిచేసారు. ఆ తర్వాత 1995 – 96  మధ్యకాలంలో జపాన్ లోనే అతిపెద్ద స్టూడియోలో ఏడాది పాటు ఫోటోగ్రఫీలో మెళుకువలను నేర్చుకొని తిరిగి ఇండియాకు వచ్చారు. ఫోటోగ్రఫీ లో ఆయనకున్న టాలెంట్ ను జపాన్ వాళ్ళు  మెచ్చి, నచ్చి   రెండు సంవత్సరాల పాటు వివిధ దేశాలలో  పనిచేయడానికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. దాంతో 1996 నుండి 1998 వరకు ఆ ప్రాజెక్ట్ వర్క్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని, ఆ తర్వాత అమెరికాలో మంచి అవకాశాలు లభించడంతో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనలోని కళాత్మక కోణాన్ని ఆవిష్కరిస్తూ మానసిక ఆనందంతో పాటుగా పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు.

  ఈ ఏడాది  ప్రథమార్థంలో  ప్రముఖ నటులు ,అభినవ దాన కర్ణుడిగా పేరుగాంచిన సోనూ సూద్ చేతుల మీదుగా UBlood APP  ప్రారంభమైన విషయం తెలిసిందే. రక్తదాతలతో పాటుగా రక్తగ్రహీతల సమస్త సమాచారం ఉన్న యాప్ ఈ UBlood APP . రక్తదానం యొక్క విశిష్టతను తెలియజేసేలా ఈ యాప్ ను రూపొందించారు జై యలమంచిలి.

  UBlood App  ఫౌండర్ మరియు అధినేత , JSW & Jaiswaraajya సంస్థల శ్రేయోభిలాషి  జై యలమంచిలి సహకారంతో JSW & Jaiswaraajya  సంస్థలకు  డైరెక్టర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ శివకుమార్ ఆనంద్. ఇప్పటికి కూడా ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ అంటే మక్కువ కావడంతో ఆయనే అవి నిర్వహిస్తుండటం విశేషం. యువకుడిగా ఉన్న సమయంలో కష్టించి పనిచేయడం వేరు …….  వయసు మీద పడుతున్నప్పటికీ కష్టించి పనిచేయడంలో , ఫోటోగ్రఫీలో తనకున్న ఆసక్తి ప్రదర్శించడంలో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు.

  యద్దనపూడి సులోచన రాణి నవల ఆధారంగా శరత్ బాబు – రూప హీరో హీరోయిన్ లుగా మంజులా నాయుడు దర్శకత్వంలో ” ఆగమనం ” అనే సీరియల్ రూపొందగా ఆ సీరియల్ కు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసారు డాక్టర్ శివకుమార్ ఆనంద్. శరత్ బాబు లాంటి నటుడు అప్పట్లో సినిమాల్లో చాలా బిజీగా ఉండేవారు. అయినప్పటికీ శరత్ బాబును హీరోగా పెట్టి సీరియల్ నిర్మించడం అప్పట్లో సంచలనమే అయ్యింది. ఇక నటులు శరత్ బాబుకు కూడా ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉండటంతో ఆ సమయంలో శివకుమార్ ఆనంద్ ని తన హోటల్ కు పిలిపించుకొని ఫోటోగ్రఫీ పై చర్చిస్తూ అందులోని మెళుకువలను నేర్చుకునేవారు. ఆగమనం సీరియల్ రెండేళ్లకు పైగా ప్రసారమై  ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అప్పట్లో ఆగమనం అనే సీరియల్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

  డాక్టర్ శివకుమార్ ఆనంద్  భార్య పేరు ఉమాదేవి. భర్తకు ఫోటోగ్రఫీ పట్ల మక్కువ ఉండటంతో ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఇద్దరు పిల్లలు కాగా అబ్బాయి సాయి కిరణ్  ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేసి మార్స్ శాటిలైట్ కి డిజైన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఇక అమ్మాయి పేరు శివాని తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శివాని మరో అడుగు ముందుకేసి ……. న్యూయార్క్ యూనివర్సిటీలో సినిమాటోగ్రఫీలో డిగ్రీ చేస్తున్నారు.

  Share post:

  More like this
  Related

  Windows : విండోస్  లోసాంకేతిక లోపాలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

  Windows Windows : జూలై 19 ఉదయం నుంచి బ్యాంకులతో సహా మైక్రోసాఫ్ట్...

  Darling Movie : మూవీ రివ్యూ : డార్లింగ్ హిట్టా.. ఫట్టా..?

  డైరెక్షన్ : అశ్విన్ రామ్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి సినిమాటోగ్రఫి: నరేష్ ఎడిటర్: ప్రదీప్...

  Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

  Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

  Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

  Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related