
స్వరా భాస్కర్ : ఈ నటి తన పెళ్లి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ జిరార్ అహ్మద్ తో జరిగింది అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
రాధికా కుమారస్వామి : మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని ఈ నటి 2006లో పెళ్లి చేసుకుంది.. ఈమె కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మెప్పించింది.
నవనీత్ కౌర్ రానా : ఈమె తెలుగు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. ఇక ఈ బ్యూటీ కూడా ఎమ్మెల్యే రవి రానా ను పెళ్లి చేసుకుంది. నవనీత్ కౌర్ 2011లో మహారాష్ట్ర స్వతంత్య అభ్యర్థి రవి రానాను సామూహిక వివాహం చేసుకుంది. ఈమె కూడా పెళ్లి తర్వాత రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తోంది.
అయేషా టకియా : తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈమె 2009లో తన బాయ్ ఫ్రెండ్ మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు అబూ అసిమ్ అజ్మీ కుమారుడు ఫర్హాన్ ఆజ్మీని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈయన సమాజ్ వాదీ పార్టీలో ఉన్నాడు.
పరిణితీ చోప్రా : బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా గురించి అందరికి తెలుసు.. ఈమె ఇటీవలే మే 13న ఎంగేజ్మెంట్ చేసుకుంది.. ఏఏపీ లీడర్ రాఘవ్ చద్దాతో నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.