కాంటినెంటల్ హాస్పిటల్స్ , స్మార్ట్ విజన్ మరియు డిజి క్లినిక్ సంయుక్తంగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపును హైదరాబాద్ లోని JSW & Jaiswaraajya సంస్థ కార్యాలయంలో జరిగింది. UBlood app సిబ్బందితో పాటుగా JSW & Jaiswaraajya సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ పరీక్షలు చేయించుకున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మరింత చురుగ్గా పని చేస్తాడు. హైదరాబాద్ మహా నగరంలో గజిబిజి జీవితాలతో నిత్యం సతమతం అవుతుంటారు. అలాగే రకరకాల జబ్బుల బారిన పడుతుంటారు. మనకు తెలియకుండానే జబ్బున బారిన పడే అవకాశం ఉంది. రోగం ఏంటో ముందే తెలుసుకోవడం వల్ల ముందుగానే ఆ రోగానికి సంబంధించిన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మహత్కార్యానికి పూనుకుంది UBlood , JSW & Jaiswaraajya యాజమాన్యం.
కాంటినెంటల్ హాస్పిటల్స్ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ కనుకుంట్ల జగదీష్ కుమార్ తో ఈ విషయం గురించి చర్చించడంతో ఆయన పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ తో పాటుగా డిజి క్లినిక్ , స్మార్ట్ విజన్ ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో JSW & Jaiswaraajya సంస్థల అధినేత యలమంచిలి కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందిని అభినందించారు. JSW & Jaiswaraajya సంస్థల కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా చేశారు. శివ , చలపతి , అశోక్ తదితర సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఇలాంటి హెల్త్ క్యాంప్ తమ యజమాని జై యలమంచిలి నిర్వహించడం సంతోషం కలిగించిందన్నారు