
Harshasai : సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీని వల్ల చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ నుండి ఎంతో మంది మనీ సంపాదించు కుంటున్నారు. ప్రతిభ ఉన్న వారు కొత్త కొత్త ఐడియాలతో వీడియోలు చేస్తూ డబ్బులు బాగా ఆర్జిస్తున్నారు. ఆ వీడియోల్లో ఒక్క వీడియో క్లిక్ అయిన రాత్రికి రాత్రి ఫేమస్ అవుతున్నారు.
మరి ఎంతో మందిలో హర్షసాయి ఒకరు.. ఈ యువకుడు యూట్యూబ్ లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద సంచలనం సృష్టించాడు. ఇతడు అంతగా గుర్తింపు పొందేలా ఏం చేస్తున్నాడంటే.. పేదవారిని గుర్తించి వారిని ఆదుకునే కార్యక్రమాలతో మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు..
ప్రజెంట్ హర్షసాయికి 8.64 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.. ఇతర వెబ్ సైట్స్ లో కలిపి మొత్తంగా 10 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.. అయితే ఈయన ఇంతగా పాపులర్ అవ్వడంతో రాజకీయాల్లోకి కానీ సినిమాల్లోకి కానీ వస్తాడని అంతా అనుకున్నారు. మరి ఇందుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు టాక్..
బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఒక సినిమా చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్ లో ఈయన భాగం కాబోతున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.. మిత్రా శర్మ నిర్మించబోయే సినిమాతో ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట.. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మారబోతున్నట్టు తెలుస్తుంది.. హీరోలకు ధీటుగా కనిపించే హర్షసాయి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.