పబ్ నుండి బయటకు వచ్చాక నన్ను ఇంటి దగ్గర దింపుతామని ట్రాప్ చేసి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి రేప్ చేసారంటూ సంచలన విషయాలు వెల్లడించింది మైనర్ బాలిక. మే 28 న హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ లో పార్టీ జరుగగా ఆ పబ్ లోనే బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన మైనర్ బాలురు మైనర్ బాలికను అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలు వివాదాలను కూడా రాజేసింది. పోలీసుల విచారణ సరైన కోణంలో జరగడం లేదని ఆరోపిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పలు సాక్ష్యాలను మీడియా ముందు పెట్టడంతో మరింత సంచలనం అయ్యింది ఈ కేసు. ఈ అత్యాచారం కేసులో అయిదుగురు మైనర్ లు ఉండగా ఒకరు మేజర్. బెంజ్ కారులోనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించారని , ఆ తర్వాత బెంజ్ కారు ఇరుగ్గా ఉందని ఇన్నోవా కారులోకి బలవంతంగా తీసుకెళ్లారని , నా హ్యాండ్ బ్యాగ్ , సెల్ ఫోన్ , కళ్ళజోడు లాక్కున్నారని ఆపై అత్యాచారం చేసారని బాలిక స్టేట్ మెంట్ ఇచ్చింది.