17.9 C
India
Tuesday, January 14, 2025
More

    ILEANA : ఐటం గర్ల్ గా మారుతున్న ఇలియానా

    Date:

    గోవా భామ ఇలియానా ఐటెం గర్ల్ గా మారనునట్లు తెలుస్తోంది. హిందీలో బ్రహ్మాండం బద్దలు కొడతాను అంటూ తెలుగు చిత్రాలను పక్కన పెట్టి మరీ బాలీవుడ్ చెక్కేసిన ఈ భామకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇక వచ్చన అరకొర సినిమాలు ఈ భామకు ప్రత్యేకంగా గుర్తింపుని ఇవ్వలేకపోయాయి. అయితే చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకొని తెగ ఎంజాయ్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ భామ రవితేజ హీరోగా నటిస్తున్న ” రామారావు ఆన్ డ్యూటీ ” అనే సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

    ఇంతకుముందు ఇలియానా – రవితేజ కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చినప్పటికీ ” కిక్ ” అనే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. దేవుడు చేసిన మనుషులు , ఖతర్నాక్ , అక్బర్ అమర్ ఆంటోనీ చిత్రాలు మాత్రం డిజాస్టర్ గా నిలిచాయి. రవితేజ – ఇలియానా కాంబినేషన్ లో 4 చిత్రాలు రాగా ఒక్కటి మాత్రమే సూపర్ హిట్.

    అయితే రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో మాత్రం హీరోయిన్ గా కాదు ఐటెం గర్ల్ గా మారనుందట. ఇలియానా ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని పైగా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ధీమాగా ఉన్నారట. ఇక ఈ భామకు రవితేజ అంటే ప్రత్యేకమైన అభిమానం దాంతో రవితేజ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Maha Kumbh Mela : మహా కుంభమేళా: త్రివేణీ సంగమంలో విదేశీయుల స్నానాలు

    Maha Kumbh Mela : మహా కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులూ ఎక్కువగానే...

    Bhogi celebrations : భోగి సంబరాల్లో MLC కవిత, మంచు ఫ్యామిలీ, రోజా

    Bhogi celebrations : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి...

    Rain alert : మూడు రోజులు వర్షాలు

    Rain alert : AP: ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు...

    Water Supply : నేడు, రేపు వాటర్ బంద్

    Water Supply : నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related