ఇండోనేషియాలో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట జరగడంతో 127 మంది చనిపోయారు. 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఇండోనోషియా లోని తూర్పు జావా ప్రావిన్స్ లో పెర్సెబాయ సురబాయ – అరేమా జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది.
అయితే అరేమా జట్టు ఓడిపోయింది. దాంతో ఇరు జట్ల అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ముదిరి పాకాన పడింది. ఇంకేముంది గ్రౌండ్ లోకి దిగి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా వందల మంది గొడవకు దిగడంతో పోలీసులు బాష్పవాయవు ప్రయోగించారు. దాంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 127 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ తొక్కిసలాటలో 180 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు.