
Hijras : సమాజంలో పురుషులు, స్త్రీలు ఉంటారు. కానీ అటు ఇటు కాని వారు కూడా ఉంటారు. వారే హిజ్రాలు. వారు దీవిస్తే శుభం కలుగుతుంది. వారు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని అంటుంటారు. వారిని దైవాంశసంభూతులుగానే భావిస్తారు. వారితో మనకు శుభాలు జరుగుతాయని చెబుతారు. ఈ నేపథ్యంలో హిజ్రాల మనసు స్వచ్ఛమైనదని, వారు దీవిస్తే మేలు కలుగుతుందని నమ్ముతారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి కింద కొందరు హిజ్రాలు ఉంటున్నారు. వారు సామాజిక సేవే పరమావధిగా జీవిస్తున్నారు. పిల్లల చదవులు, వారి ఆకలి తీర్చడానికి, ఎవరైనా చనిపోతే అనాథలైతే వారి అంత్యక్రియలు చేస్తూ వారికి మనసు ఉందని నిరూపిస్తున్నారు. వారు సంపాదించే దానిలో ఎక్కువ మొత్తం సామాజిక సేవలో పెడుతున్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
హిజ్రాలు గత 25 ఏళ్లుగా సామాజిక సేవలో ముందుకు వెళ్తున్నారు. ఇందులో 500 మంది సభ్యులుండగా పది మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వారు సంపాదించిన డబ్బు సామాజిక సేవ కోసమే ఖర్చు చేస్తున్నారు. తమ శక్తితో పది మందికి అన్నం పెట్టడం సంతోషంగా ఉందని అంటున్నారు. ఇలా వారిని చూసి చాలా మంది స్పూర్తి పొందుతున్నారు.
పేదలను ఆదుకోవడంలో మాకు సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం గొప్ప వరంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవ అందరికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. సామాజిక సేవలో వారు తమ జీవితాన్ని అర్పిస్తున్నారు. దీంతో వారి పనిని అందరు మెచ్చుకుంటున్నారు. సమాజ సేవ చేసే అవకాశం రావడం గొప్ప విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.