భారత ప్రధాన న్యాయమూర్తిగా విశిష్ట సేవలు అందించిన జస్టిస్ ఎన్వీ రమణకు ఘనంగా వీడ్కోలు పలికారు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు , న్యాయవాదులు. 2021 ఏప్రిల్ లో భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు జస్టిస్ ఎన్వీ రమణ. చీఫ్ జస్టిస్ గా విశేషమైన తీర్పులను అందించి చరిత్ర సృష్టించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారు.
తనకు ఘనమైన వీడ్కోలు పలికిన సుప్రీం కోర్టు సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపారు జస్టిస్ ఎన్వీ రమణ. ఉత్తమమైన న్యాయమూర్తిగా పని చేయలేదేమో కానీ సామాన్యులకు న్యాయం అందుబాటులోకి వచ్చేలా మాత్రం పని తీరు కనబరిచానని స్పష్టం చేసారు. కరెంట్ లేని గ్రామం నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నానని , నా ఈ ప్రయాణంలో స్ఫూర్తిగా నిలిచిన వాళ్లకు అలాగే సహకరించిన వాళ్లకు అందరికీ రుణపడి ఉంటానన్నారు.