మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు నటుడు మాణిక్. ఈరోజు ఫిలిం ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాణిక్ తో పాటుగా సీనియర్ నటుడు , సభ్యుడు హరనాథ్ కూడా పాల్గొన్నాడు. అసలు ‘మా ‘ ఎన్నికలు ఇండియా – పాకిస్థాన్ మాదిరిగా తయారయ్యిందని ఇలాంటి సంఘటనలు గత 25 సంవత్సరాలలో నేను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేసాడు నటుడు మాణిక్.
వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరుతూ 100 కుపైగా మందితో సంతకాలు సేకరించానని కృష్ణంరాజు , చిరంజీవి , జయసుధ తదితరులకు ఈ లేఖలు అందిస్తున్నామని ఆగస్టు 29 న మా జనరల్ బాడీ సమావేశం ఉంటుందని దాని తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని ఐతే ఎన్నికలకు బదులుగా మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు మాణిక్.
అలాగే ప్రెసిడెంట్ నరేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హేమ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇలాంటి చర్య చేపట్టడం ద్వారా భవిష్యత్తులో ఎవరు కూడా మా గురించి తక్కువ చేసి మాట్లాడే సాహసం చేయరని అంటున్నాడు.